'ఓ బేబీ' సినిమా ప్లాప్ అవుతుంది అన్న నెటిజెన్ ను సమంత ఏమన్నదో తెలుసా..

by సూర్య | Wed, Jun 19, 2019, 06:08 PM

‘ఓ బేబీ’ సినిమా పక్కా ప్లాప్ అవుతుందంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసిన ఓ నెటిజన్ తనదైన శైలిలో ప్రముఖ నటి సమంత సమాధానం ఇచ్చింది. సాధారణంగా సామ్ సినిమాలన్నింటికీ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే ‘ఓ బేబీ’ చిత్రం తమిళ్ వర్షన్‌కు కూడా చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని సామ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తమిళంలో చిన్మయి డబ్బింగ్ చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేసింది. 


దీనిపై స్పందించిన శైలజ అనే నెటిజన్ చాలా సంతోషంగా ఉందని, దర్శకురాలు నందినిరెడ్డి, సమంతల కాంబినేషన్‌పై అంచనాలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ‘ఓ బేబీ’ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు శైలజ తెలిపింది. ఈ ట్వీట్లను చూసిన కిరు అనే అనే నెటిజన్, ‘ఫెమినిస్ట్‌లందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ప్లాప్’ అని కామెంట్ చేశాడు. దీనిపై సామ్ స్పందిస్తూ, ‘హాహా.. థాంక్యూ.. ప్రపంచం ఒక మూర్ఖుడిని కలిసింది.. మూర్ఖుడు ప్రపంచాన్ని కలిశాడు’ అని సమాధానమిచ్చింది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM