OTT విడుదల తేదీని లాక్ చేసిన 'జనక అయితే గనక'

by సూర్య | Wed, Oct 30, 2024, 02:08 PM

సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెలుగు నటుడు సుహాస్ నటించిన 'జనక అయితే గనక' చిత్రం అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ సమయంలో మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ కోర్ట్‌రూమ్ కామెడీ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నవంబర్ 8, 2024న ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్‌లు ముందస్తు యాక్సెస్‌తో అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. అధికారిక ప్రీమియర్‌కి ఒక రోజు ముందు సినిమాను చూడగలరు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సంగీత విపిన్ కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

Latest News
 
పొట్టి డ్రెస్ లో ఆహ్నా శర్మ Fri, Jun 13, 2025, 08:42 PM
ఈనెల 15న అనంతిక ‘8 వసంతాలు’ ట్రైలర్ విడుదల Fri, Jun 13, 2025, 08:38 PM
భారీ మొత్తానికి అమ్ముడయిన 'ఘాటి' డిజిటల్ రైట్స్ Fri, Jun 13, 2025, 06:02 PM
సుమ తో '8 వసంతాలు' బృందం Fri, Jun 13, 2025, 05:58 PM
'SSMB29' తదుపరి షెడ్యూల్ ఎక్కడంటే..! Fri, Jun 13, 2025, 05:49 PM