చిరంజీవి తన పుట్టినరోజు నాడు అభిమానులకు గిఫ్ట్ ఇస్తున్నాడా?

by సూర్య | Wed, Jun 19, 2019, 04:29 PM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ చిరు పుట్టినరోజు నాడు ఆగస్టు 22న విడుదల కానుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. అలాగే సీజీ వర్క్ సంబంధించి కూడా ప్రస్తుతం వివిధ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.


సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Latest News
 
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM
కస్తూరి శంకర్ సంచలనం కామెంట్స్ Sat, Apr 20, 2024, 02:10 PM
ట్రెండీ లుక్ లో క్యూట్ గా అంజలి Sat, Apr 20, 2024, 02:07 PM
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM