నాగశౌర్యను పరామర్శించిన రాఘవేంద్రరావు

by సూర్య | Wed, Jun 19, 2019, 03:07 PM

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాగశౌర్యను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. చికిత్స చేసిన వైద్యులు 25 రోజులపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి హీరోను ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.‘నర్తనశాల’ తర్వాత నాగశౌర్య నటించిన ‘ఓ బేబీ’ సినిమా జులై 5న విడుదల కాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్‌ రోల్‌ను పోషించారు. లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి తెలుగు రీమేక్‌ ఇది.

Latest News
 
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM