హ్యాపీ బర్త్‌డే కాజల్ అగర్వాల్

by సూర్య | Wed, Jun 19, 2019, 01:02 PM

జూన్ 19.. కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ బర్త్‌డే.. 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్.. హిందీ, తమిళ్ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రానా, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అజిత్, విజయ్, సూర్య, కార్తీ, విశాల్, ధనుష్, జీవా వంటి హీరోలతో నటించింది. సీనియర్లతో పాటు, కుర్ర హీరోల పక్కన కూడా ఆడిపాడింది.


సరోజ, ఎవడు, సైజ్ జీరో మూవీస్‌లో ప్రత్యేక పాత్రలు చేసింది. జనతా గ్యారెజ్‌లో చేసిన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పలు యాడ్స్‌లోనూ నటించింది. పునీత్ రాజ్‌కుమార్ కన్నడ మూవీ చక్రవ్యూహలో సాంగ్ పాడింది.  త్వరలో 50 సినిమాలు పూర్తి చెయ్యనుంది. బిజినెస్‌‌తోపాటు, సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది కాజల్.


 


ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ తమిళ్ రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్', జయంరవి 'కోమాలి'తోపాటు  శర్వానంద్‌తో 'రణరంగం' సినిమాలు చేస్తుంది. కాజల్‌కి బర్త్‌డే విషెస్ చెబుతూ సినిమాలో ఆమె లుక్ రిలీజ్ చేసింది రణరంగం టీమ్. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కాజల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM