తప్పు జరిగిందన్న యాంకర్ రవి!

by సూర్య | Sat, Jun 15, 2019, 07:33 PM

పటాస్’ టీవీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దూషించడంపై వివాదం ముదురుతోంది. షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న రవిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో అతడు ట్విటర్‌లో వివరణ ఇస్తూ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. షోలో తప్పు జరిగిందని, అయితే ఈ వ్యవహారంలో తన తప్పేమిటో తెలియడం లేదని అన్నారు.
ఇదీ వివాదం..
షోలో మ‌హిధర్ అనే వ్యక్తి చదువు అక్కర్లేదని మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘చదువుకున్నోళ్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోరని మొన్న 23వ తేదీనాడు నాకు తెలిసింది..’ అని అన్నాడు. మే 23న ఏపీ ఎన్నికల ఫలితాలు రావడం, వైఎస్సార్ కాంగ్రెస్ గెలవడం తెలిసిందే. ఈ డైలాగుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మహిధర్ వ్యాఖ్యల ప్రకారం.. చదువు రానోళ్లే  జగన్‌ను గెలిపించారని భావించాల్సి వస్తుందని, ఈటీవీ షో కాబట్టి అలాంటి డైలాగులే ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. రవిని కూడా తిడుతున్నారు. ఆ డైలాగ్ చెప్పే సమయంలో రవి చప్పట్లు చెరుస్తూ వేదికపైకి వెళ్లడం దీనికి కారణం. పటాస్ షోను ఏపీ ప్రజలు కూడా చూస్తారని, వారిని అవమానించినందుకు రవి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రవి వివరణ. .
‘ఏపీ ప్రజలపై మహిధర్‌ చేసిన స్టేట్‌మెంట్‌ను సపోర్ట్ చేయలేదు. యాంకర్‌గా అక్క‌డ ఎవ‌రు ఉన్నా అలాగే ప్ర‌వ‌ర్తిస్తారు. ఇలాంటి వివాదాల్లోకి నన్ను లాగొద్దు. నన్నెందుకు లాగుతున్నారు. కాంట్ర‌వ‌ర్సీలు నాకు అలవాటయ్యాయి. వాటిపై వీడియోల ద్వారా వివ‌ర‌ణ ఇవ్వడం అలవాటైపోయింది. నేను సారీ చెప్పాల‌ని అంటున్నారు. నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు. నేనూ మీరూ, ఒకటే. నేను తెలుగు వాడిని. ఏపీ వాళ్లు, తెలంగాణ వాళ్లు నా వాళ్లు.. నాకు ఎపీ సీఎం జ‌గ‌న్ అంటే ఎంతో ఇష్టం. వారి ఫ్యామిలీతో కూడా మాట్లాడాను. మ‌రో నెల రోజుల‌లో ఆయనను కలుస్తున్నాను…’’ అని ట్విటర్ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Latest News
 
'రాజా సాబ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 16, 2024, 08:04 PM
'కన్నప్ప' కోసం హైదరాబాద్ కి వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 07:42 PM
తేజ సజ్జ కొత్త చిత్రానికి హనుమాన్ కంపోజర్ Tue, Apr 16, 2024, 07:36 PM
'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ కి సెన్సషనల్ రెస్పాన్స్ Tue, Apr 16, 2024, 07:34 PM
భూల్ భూలయ్యా 3 లో ఈ స్టార్ హీరోయిన్లపై క్రేజీ సాంగ్ Tue, Apr 16, 2024, 07:24 PM