'విరూపాక్ష' వరల్డ్ టీవీ ప్రీమియర్ కి తేదీ లాక్

by సూర్య | Mon, Oct 14, 2024, 02:14 PM

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'విరూపాక్ష' సినిమాలో సూపర్ హిట్ గా నిలిచింది.  ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా విపరీతమైన పాపులారిటీ సంపాదించడమే కాకుండా సాయి తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటించింది. తాజా వార్త ఏమిటంటే, ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే రాశారు. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ విరూపాక్షను నిర్మించారు. అజయ్, సాయి చంద్, శ్యామల, బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల, రవికృష్ణ, సోనియా సింగ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు.

Latest News
 
'కూలీ' ట్రైలర్ విడుదల తేదీ వెల్లడి Tue, Jul 15, 2025, 07:31 AM
'కుబేర' లోని శంకరా ఫుల్ వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Tue, Jul 15, 2025, 07:26 AM
నేడే సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Tue, Jul 15, 2025, 07:21 AM
మెగా స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ Mon, Jul 14, 2025, 07:40 PM
వాయిదా పడనున్న 'మాస్ జాతర' విడుదల Mon, Jul 14, 2025, 07:34 PM