![]() |
![]() |
by సూర్య | Sun, Oct 13, 2024, 09:17 PM
హీరోయిన్ తాప్సికి (Taapsee) టర్కిష్ ఎయిర్‌లైన్స్ (turkish airlines) వల్ల ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ 24 గంటలు ఆలస్యమైందని, మరోవైపు కస్టమర్ కేర్ సర్వీసు కూడా అందుబాటులో లేదని మండిపడ్డారు. ఎయిర్‌లైన్స్ 24 గంటటలు ఆలస్యం అనేది మీ సమస్య. ఇది ప్రయాణికుల సమస్య కాదు అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అయితే, తనకు ఎదురైన ఈ అనుభవం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని తాప్సీ వెల్లడించలేదు.
Latest News