by సూర్య | Sun, Oct 13, 2024, 07:26 PM
ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో వున్న పవన్‌కల్యాణ్ తన సినిమాల చిత్రీకరణ కూడా మరోవైపు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటైన 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'సినిమా షూటింగ్‌లో ఆయన ఇటీవల పాల్గొన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 14నుంచి తిరిగి ప్రారంభం కానుందని, నవంబరు 10 వరకు జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని ఇక ఈ చిత్రం నుంచి తొలి లిరికల్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నామని, ఈ గీతాన్ని పవన్‌కల్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషమని తెలిపారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను దసరా సందర్భంగా విడుదల చేసి లిరికల్ పాట విడుదల అప్‌డేట్‌ను ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ''సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది' అని తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎ.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు
Latest News