విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం'

by సూర్య | Sat, Oct 12, 2024, 08:26 PM

పద్మశ్రీ బ్రహ్మానందం రాబోయే సినిమా 'బ్రహ్మ ఆనందం' లో అతని కుమారుడు రాజా గౌతమ్‌తో పాటు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. వారు వరుసగా తాత మరియు మనవడు పాత్రలను ఈ సినిమాలో పోషిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన బ్రహ్మానందం ఫస్ట్ లుక్ ని ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నటుడు సంప్రదాయ పట్టు పంచె మరియు చొక్కా ధరించి ఇంట్లోకి వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మరియు గ్లింప్సె కి భారీ రెస్పాన్స్ లభించింది. తాజాగా మూవీ మేకర్స ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. RVS నిఖిల్ దర్శకత్వం వహించిన చిత్రంలో ప్రియా వడ్లమాని మరియు ఐశ్వర్య హోలక్‌కల్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
రూ.100 కోట్ల క్లబ్‌లో లక్కీ భాస్కర్.. Thu, Nov 14, 2024, 02:00 PM
హీరో సుశాంత్‌తో 'లక్కీ భాస్కర్' నటి ప్రేమాయణం? Thu, Nov 14, 2024, 12:30 PM
దూసుకొస్తున్న యష్మి.. Thu, Nov 14, 2024, 11:49 AM
మోడ్రన్ డ్రెస్ లో నయనతార గ్లామరస్ ఫోటోషూట్ Thu, Nov 14, 2024, 11:18 AM
తిరుమల శ్రీవారి సేవలో 'మట్కా' టీమ్ Wed, Nov 13, 2024, 04:04 PM