బుక్ మై షోలో 'మార్టిన్' జోరు

by సూర్య | Sat, Oct 12, 2024, 03:59 PM

ధృవ్ సర్జా యొక్క చాలా ఎదురుచూస్తున్న చిత్రం మార్టిన్ అక్టోబర్ 11న పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అర్జున్ సర్జా రాసిన కథతో AP అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైభవి శాండిల్య కథానాయికగా నటించింది. అయితే డిస్ట్రిబ్యూటర్లతో సమస్యల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  మరియు ఇతర ప్రాంతాలలో చాలా ఉదయపు షోలు రద్దు చేయబడ్డాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా కి బుక్ మై షోలో గత 24 గంటలలో 93.29K టికెట్స్ బుక్ అయ్యినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్ మరియు నికితిన్ ధీర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, అరబిక్, జపనీస్, చైనీస్, కొరియన్ మరియు రష్యన్ తో సహా 12 భాషల్లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి మణిశర్మ పాటలు కంపోస్ చేయగా రవి బస్రూర్ సంగీతం అందించారు. మార్టిన్‌ను వాసవి ఎంటర్‌ప్రైజెస్ మరియు ఉదయ్ కె మెహతా ప్రొడక్షన్స్ నిర్మించాయి.

Latest News
 
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM
'ఆంధ్రుల అన్నపూర్ణ డోక్కా సీతమ్మ' ఆన్ బోర్డులో కేశావి Sat, Jun 14, 2025, 05:11 PM
నేడు విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ట్రైలర్ Sat, Jun 14, 2025, 05:06 PM
నేడే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ Sat, Jun 14, 2025, 04:53 PM