'హరిహర వీర మల్లు' ఫస్ట్ సింగల్ కి గాత్రనై అందించిన పవన్ కళ్యాణ్

by సూర్య | Sat, Oct 12, 2024, 03:35 PM

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' లో తదుపరి కనిపించనున్నారు. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ చర్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా హోల్డ్ లో ఉంది. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగాడు. ఈ చిత్రానికి ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎపిక్ హరి హర వీర మల్లు పార్ట్-1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ షూటింగ్ పునఃప్రారంభం అయ్యింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈరోజు దసరా సందర్భంగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ కి పవన్ కళ్యాణ్ తన గాత్రాన్ని అందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సాంగ్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్‌ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మరియు ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై AM రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు మరియు జ్ఞానశేఖర్ మరియు మనోజ్ కె పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM