'విశ్వంభర' టీజర్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Fri, Oct 11, 2024, 09:52 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రేపు ఉదయం 10:49 గంటలకి రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM