by సూర్య | Fri, Oct 11, 2024, 10:35 AM
తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు అడియన్స్ మనసులు దొచేసింది హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి తో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించింది ఈ అమ్మడు..ఈ మూవీలో తన నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు , జాతీయ స్థాయిలో అవార్డ్ అందుకుంది.గ్లామర్ రోల్స్ కాదు.. లేడీ ఓరియెంటెడ్ లతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టినప్పటికీ అందం.. అభినయంతో ఇమేజ్ సొంతం చేసుకుంది.నేను శైలజ తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన కీర్తి.. ఇటీవలే రఘుతాత తో అడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది.కంటెంట్ నచ్చితే హీరోయిన్ పాత్రలే కాదు సిస్టర్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉంటుంది. రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో చెల్లెలి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కీర్తి చాలా యాక్టివ్.తాజాగా సోషల్ మీడియాలో కీర్తి షేర్ చేసిన ఫోటోస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. పింక్ చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోతుంది కీర్తి. హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది కీర్తి. అలాగే మరో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Latest News