మీరా చోప్రా ఎమోషనల్ కామెంట్స్..!

by సూర్య | Thu, Oct 10, 2024, 08:42 PM

బాలీవుడ్ బ్యూటీ మీరా చోప్రా తెలుగు ,తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో అడపాదడపా చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల మీరా చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.మీరా చోప్రా మాట్లాడుతూ తనకు ప్రియాంక చోప్రా కూడా దగ్గర బంధువు అవుతుంది.. అయినా కూడా అవకాశాల కోసం తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తమ కుటుంబం మధ్యతరగతి కుటుంబమని.. ప్రియాంక చోప్రా సినిమాలలోకి రావడం వల్ల తనకి కూడా ఇండస్ట్రీ పైన చాలా ఆసక్తి పెరిగింది అని అలా 2005లో అన్బ్ ఆరుయిరే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా దాదాపుగా తన సినీ కెరియర్ లో 25 సినిమాలలో నటించానని.. అయినప్పటికీ కూడా దక్షిణాదిలో తనకు ఇష్టం లేకపోయినా నటించానని ఎందుకంటే తనకు భాషపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది మీరా చోప్రా.


కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో తనకు అవకాశాల విషయంలో ఎన్నో సవాళ్లు సైతం ఎదురయ్యాయని ఆఫర్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలో తనకి అర్థం కావడం లేదని.. కొంత మంది అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చిన తర్వాత మళ్లీ వేరే వాళ్ళను తమ సినిమాలలో తీసుకునేవారని.. ఇలా ఎన్నో విషయాల వల్ల తాను తన జీవితంలో చాలా సఫర్ అయ్యానని తెలిపింది.. అయితే ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా తనకు అవకాశాల విషయంలో ఎక్కడ కూడా హెల్ప్ అడగలేదని.. కేవలం తన స్వయంకృషితోనే అవకాశాలు సంపాదించుకోవాలని చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది మీరా చోప్రా.

Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM