భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా : రజినీకాంత్‌

by సూర్య | Thu, Oct 10, 2024, 08:28 PM

రతన్‌ టాటా మరణంపై స్టార్‌ నటుడు రజినీకాంత్‌  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విజన్‌, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌  రతన్‌ టాటా అని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.‘తన విజన్‌, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి నుంచి ప్రేమ, అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయనకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata) మరణించిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణంపై యావత్‌ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రతన్‌ టాటా మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


 


 

Latest News
 
స్టైలిష్ గా నిక్కీ తంబోలి ... ఫొటోస్ Sat, Jul 12, 2025, 08:30 PM
మోసపోయిన నటి అనసూయ.. ఇన్‌స్టాలో స్టోరీ Sat, Jul 12, 2025, 08:23 PM
ఇకపై రొమాంటిక్‌ సినిమాలు చేయను: ఆర్‌ మాధవన్‌ Sat, Jul 12, 2025, 08:21 PM
'ది ప్యారడైజ్' లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ Sat, Jul 12, 2025, 07:19 PM
రాజమండ్రిలో 'ది 100' టీమ్ విసిట్ వివరాలు Sat, Jul 12, 2025, 06:44 PM