by సూర్య | Thu, Oct 10, 2024, 04:54 PM
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెకానిక్ రాకీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 31, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని ఓ పిల్లో అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ ఇంస్టాగ్రామ్ లో 6K+ రీల్స్ తో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని జేక్స్ బిజోయ్ స్వరపరచగా, నాకాష్ తన గాత్రాన్ని అందించారు. ఈ సాంగ్ కి భాను కొరియోగ్రఫీ అందించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
Latest News