హాలీవుడ్ లో అభిన‌య మెరుపులు

by సూర్య | Thu, Jun 13, 2019, 11:26 AM

హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలన్నది నటీనటులకు ఓ కల. చాలా అరుదుగా లభించే ఆ అవకాశాలు మన భారతీయ నటీనటులలో కొద్దిమందిని వరిస్తుంటాయి. ఇప్పటికే కొందరు భారతీయ తారలు హాలీవుడ్‌ సినిమాల్లో మెరిసిన సంగతి తెలియంది కాదు.


ఐశ్వర్యారాయ్‌, దీపికాపదుకొనె, ప్రియాంకచోప్రా వంటి బాలీవుడ్‌ తారలు హాలీవుడ్‌ సినిమాల్లో సందడి చేశారు. ఆ మధ్య వరుసగా కొన్ని హాలీవుడ్‌ చిత్రాలు చేసిన ప్రియాంకచోప్రాను అక్కడికే మకాం మార్చేసినట్లుగా అనుకున్నారు కూడా. ఇక అమెరికాకు చెందిన నిక్‌తో వివాహం జరగడంతో హాలీవుడ్‌కు ఆమె మరింత దగ్గరైనట్లయింది. ఇక దీపికాపదుకొనె లోగడ ట్రిఫుల్‌ ఎక్స్‌ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఆ చిత్రం నాలుగో పార్ట్‌లో ఆమె నటించడం లేదట. అయితే ఆమె అభిమానులు నిరాశపడకుండా ఆ చిత్ర దర్శకుడు లుంగీ డ్యాన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. చెన్నై ఎక్స్‌ప్రెస్‌ చిత్రం నుంచి లుంగీ డ్యాన్స్‌ ఎంత పాపులర్‌ అయిందో వేరుగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఆ చిత్రం స్ఫూర్తితో లుంగీ డ్యాన్స్‌ను ట్రిఫుల్‌ ఎక్స్‌ నాలుగో భాగంలో పెట్టబోతున్నారట. ఈ హాలీవుడ్‌ చిత్రంలో దీపిక పాత్రలో అభినయించకపోయిన్పపటికీ…లుంగీ డ్యాన్స్‌లో మెరబోతోందట. వీరి సంగతి ఇలావుంటే…సీనియర్‌ నటి డింఫుల్‌ కపాడియాకు కూడా హాలీవుడ్‌ సినిమాలో నటించిన అనుభవం ఉంది. చాలా ఏళ్ల క్రితం లీలా అనే హాలీవుడ్‌ చిత్రంలో ఆమె నటించారు. హలీవుడ్‌లో పేరున్న దర్శకులలో ఒకరైన క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో డింపుల్‌ నటించనున్నారు. ఆస్కార్‌ విజేత డేవిడ్‌ వాషింగ్టన్‌ హీరోగా నటించే ఈ చిత్రానికి టెనిట్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఏడు దేశాల్లో ఈ చిత్రం చిత్రీకరణ జరపనున్నారట. వచ్చే ఏడాది జులైలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తారని సమాచారం. ఇక తెలుగు ప్రేక్షకులకు పరిచమైన తమిళ కథానాయకుడు ధనుష్‌ కూడా హలీవుడ్‌ చిత్రంలో నటించారు. ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఫాకిర్‌ పేరుతో ఆంగ్ల, ఫ్రెంచి భాషలలో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. త్వరలో ఇండియాతో పాటు యు.ఎస్‌., యు.కె., తదితర దేశాలలో విడుదల కానుంది. ఇక టాలీవుడ్‌లో అనతికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్‌ రామకృష్ణ కూడా హాలీవుడ్‌లో నటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. సిల్క్‌ రోడ్‌ అనే ఆంగ్ల చిత్రంలో ఆయన నటించనున్నారట. ఇలా హాలీవుడ్‌లోనూ తమ అభినయ మెరుపులను మెరింపించాలని అనుకుంటున్నారు.


 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM