కార్తికేయ కెరీర్ ఇబ్బందుల్లో....

by సూర్య | Tue, Jun 11, 2019, 07:18 PM

ఆర్ఎక్స్ 100' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ చేసిన రెండవ చిత్రం హిప్పీ.  ఈ సినిమా తన మొదటి చిత్రానికంటే ఎన్ని రెట్లు బాగుంటుందని కార్తికేయ నమ్మకంగా చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.  ట్రైలర్లో కూడా బోల్డ్ కంటెంట్ ఉండటంతో సినిమాలో బలమైన పాయింట్ ఏదో ఉంటుందని అనుకున్నారు.
తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే చిత్రంలో ప్రాపర్ స్టోరీ అనేదే లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.  విమర్శకులు సైతం పెదవి విరవడంతో మొదటిరోజే నెగిలెటివ్ టాక్ ఏర్పడింది.  వారాంతంలో  అయినా సినిమా పుంజుకుంటుంది అనుకుంటే అలా కూడా జరగలేదు.  వసూళ్లు మరింత క్షీణించాయి.  దీంతో చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిని అధిక మొత్తం వెచ్చించి కొత్త డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలే పరిస్థితి తలెత్తింది.  కార్తికేయ కెరీర్ సైతం ఇబ్బందుల్లో పడింది. 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' Thu, Apr 25, 2024, 02:34 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'భీమా' Thu, Apr 25, 2024, 02:30 PM
'కృష్ణమ్మ' విజయవాడ ప్రమోషనల్ టూర్ డీటెయిల్స్ Thu, Apr 25, 2024, 02:27 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 02:25 PM