వార్‌ 2 సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Oct 04, 2024, 12:53 PM

ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డం ను దక్కించుకున్నారు. దాంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌ మాత్రం టాలీవుడ్‌ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హృతిక్ రోషన్‌ తో కలిసి వార్‌ 2 లో నటించేందుకు ఓకే చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. పలు ఇంటర్వ్యూల్లో టాలీవుడ్‌ లో మాత్రమే సినిమాలు చేస్తానంటూ చెప్పిన ఎన్టీఆర్ వార్‌ 2 కి ఎందుకు కమిట్ అయ్యారు అనేది అందరికీ ఆశ్చర్యం ను కలిగించింది. వార్ 2 లోని పాత్ర ఎన్టీఆర్ కు అంతగా నచ్చిందేమో, అందుకే నటించేందుకు ఓకే చెప్పి ఉంటాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


వార్‌ సూపర్ హిట్‌ నేపథ్యంలో వార్‌ 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు. యశ్‌ రాజ్ ఫిలింస్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ కీలక షెడ్యూల్‌ లో పాల్గొన్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్‌ సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్ ను చిత్రీకరించాల్సి ఉంది. అంతకంటే ముందు ఎన్టీఆర్‌, హృతిక్ కాంబోలో ఒక మాస్ సాంగ్‌ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సెట్‌ వర్క్ పూర్తి అయిందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ మూడ్‌ లో ఉన్నారు. వార్‌ 2 సినిమా పాట చిత్రీకరణ కోసం అక్టోబర్‌ మూడో వారంలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైభవి మర్చంట్‌ నేతృత్వంలో పాట చిత్రీకరణ జరగబోతుంది. టాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్స్ లో ఎన్టీఆర్‌ ఒకరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్ హృతిక్ రోషన్ అనే విషయం తెల్సిందే. అలాంటి వీరిద్దరి కాంబోలో పాట అంటే కచ్చితంగా మరో లెవల్‌ లో ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


వార్‌ 2 సినిమా షూటింగ్‌ ఇటీవల యూరప్ లో జరిగింది. ఆ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌ హాజరు అవ్వలేదు. హృతిక్‌ రోషన్ మాత్రమే హాజరు అయ్యారు. ఈ నెలలో జరగబోతున్న షూటింగ్‌ లో ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌ లు కలిసి హాజరు అవ్వబోతున్నారు. మళ్లీ నవంబర్‌ లో లేదా డిసెంబర్‌ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులు ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలను ఒకసారి స్క్రీన్‌ పై ఎప్పుడు చూస్తామా అనే చర్చ జరుగుతోంది.

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM