'బ్రోచేవారెవరురా' సినిమాపై తాజా వార్త

by సూర్య | Tue, Jun 11, 2019, 02:26 PM

హీరో శ్రీ విష్ణు, స్టార్ కమెడియన్స్ ప్రియదర్శి,రాహుల్ ప్రధాన పాత్రలలో రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “బ్రోచేవారెవరురా”. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో నివేదా థామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓ కొత్తతరహా కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీని నేడు ప్రకటించారు. ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

నీది నాది ఒకటే కథ, మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలతో మంచి పేరుతెచ్చుకున్న శ్రీవిష్ణు ఈ మూవీ విజయం పై చాలా ఆశలే పెట్టుకున్నారట. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

Latest News
 
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Wed, Apr 24, 2024, 04:38 PM
కొత్త చిత్రాన్ని ప్రకటించిన రాఘవ లారెన్స్ Wed, Apr 24, 2024, 04:36 PM
నార్త్ అమెరికాలో $600K మార్క్ ని చేరుకున్న 'ఆవేశం' Wed, Apr 24, 2024, 04:35 PM
'లవ్ మౌళి' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Wed, Apr 24, 2024, 04:26 PM
బజ్: రజనీకాంత్ 'కూలీ' ని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారా? Wed, Apr 24, 2024, 04:17 PM