నువ్వు అన్నయ్య అంటుంటే నాకు ఎలాగో వుంది అని శ్రీకాంత్ అన్నాడు : సంగీత

by సూర్య | Tue, Jun 11, 2019, 01:04 PM

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ, ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు. "కోలీవుడ్లో నాకు సంబంధించిన విషయాల్లో హీరో విజయ్ చాలా కేర్ తీసుకునేవారు. ఇక టాలీవుడ్లో హీరో శ్రీకాంత్ నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయనతో షూటింగు అంటే ఆయనతో పాటు నాకు కూడా వాళ్ల ఇంటి నుంచి భోజనం వచ్చేది.

ఒకసారి ఒక సినిమాకి సంబంధించిన రొమాంటిక్ సీన్ ను ఎలా చేయాలనేది నాకు శ్రీకాంత్ చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నా నేను 'అలాగే అన్నయ్య .. ఓకే అన్నయ్య .. ఇలాగైతే బాగుంటుందేమో అన్నయ్యా' అని అంటున్నాను. దాంతో శ్రీకాంత్ 'అబ్బబ్బా ఎన్నిసార్లు అన్నయ్యా అంటావ్ .. చేయబోయేది రొమాంటిక్ సీన్ .. నువ్వు అన్నయ్య అంటుంటే నాకు ఎలాగో వుంది .. సంగీతకి మీరే చెప్పండి సార్' అని డైరెక్టర్ గారితో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అంటూ సంగీత నవ్వేశారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM