ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్..

by సూర్య | Tue, Jun 11, 2019, 11:46 AM

తెలుగులో సంగీత చేసిన చెప్పుకోదగిన సినిమాల్లో 'ఖడ్గం' ముందువరుసలో కనిపిస్తుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'ఖడ్గం' సినిమాను గురించి సంగీత ప్రస్తావించారు. 'ఖడ్గం' సినిమాలో నేను చెప్పిన 'ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్' అనే డైలాగ్ చాలా పాప్యులర్ అయింది. ఆ డైలాగ్ అంతగా జనంలోకి వెళ్లడానికి కారణం .. నా మనసు లోతుల్లో నుంచి ఆ డైలాగ్ రావడమే .. అంత సహజంగా ఆ డైలాగ్ నేను చెప్పడానికి కారణం, అప్పుడు నా కెరియర్ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండటమే. ఈ సినిమాకి ముందు ఇతర భాషల్లో నేను చేస్తూ వచ్చిన అన్ని సినిమాలు పరాజయంపాలవుతూ వచ్చాయి. కృష్ణవంశీ గారు ఈ పాత్రను గురించి చెబుతున్నప్పుడు .. ఈ సినిమాను తెరపై చూస్తున్నప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఇదే కదా అని అనుకునేదాన్ని" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM