తన ఫ్యామిలీ విషాదగాథ ను వెల్లడించిన తేజ

by సూర్య | Mon, Jun 10, 2019, 03:12 PM

తెలుగు దర్శకులలో తేజ స్థానం ప్రత్యేకం. విభిన్నమైన .. విలక్షణమైన కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. అలాంటి తేజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్నప్పుడు తను పడిన కష్టాలను గురించి ప్రస్తావించాడు. "మా అమ్మానాన్నలు ఉన్నంతవరకూ నేను .. మా అక్కయ్య .. చెల్లి రాజభోగాలను అనుభవించాము.


హఠాత్తుగా అమ్మ చనిపోయింది .. వ్యాపారంలో నష్టాలతో ఆస్తులన్నీపోయాయి. మా ముగ్గురిని బంధువులు పంచుకున్నారు. నేను మా బాబాయ్ దగ్గర ఉండలేక బయటికి వచ్చేశాను. లారీ క్లీనర్ గా పనిచేశాను .. హోటల్లో పనిచేశాను. చలికి పేపర్లు కప్పుకుని అరుగులపై పడుకున్నాను. కుళాయి దగ్గరే స్నానం చేసి .. అక్కడే బట్టలు ఉతికి ఆరేసుకునేవాడిని. చెన్నై వెళ్లినప్పుడు ఆ ప్రదేశాలన్నీ చూసినప్పుడు కళ్ల వెంట నీళ్లొస్తుంటాయి" అని చెప్పుకొచ్చారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM