'లగ్గం' విడుదల తేదీ పోస్టర్ ని లాంచ్ చేసిన సుధీర్ బాబు

by సూర్య | Sat, Sep 28, 2024, 03:42 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'లగ్గం' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ని టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు లాంచ్ చేసినట్లు ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు.

Latest News
 
నా వారసుడు నా కొడుకు ఆ తరవాత నా మనవడు : బాల‌కృష్ణ Sun, Sep 29, 2024, 09:56 AM
ఆ హీరోయిన్‌తో సీక్రెట్ ప్రేమ‌యాణం న‌డుపుతున్న నటుడు శింబు ? Sun, Sep 29, 2024, 09:48 AM
రణ్‌బీర్‌ కపూర్‌ గురించి మృణాల్‌ ఏమన్నదంటే.. Sun, Sep 29, 2024, 09:44 AM
ధూమ్-4 లో విలన్ గా రణబీర్ కపూర్ ? Sun, Sep 29, 2024, 09:37 AM
USAలో $4M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Sat, Sep 28, 2024, 08:37 PM