'భలే ఉన్నాడే' నుండి ఆడోళ్లకి ఆమడ దూరం వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Sep 27, 2024, 05:10 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన 'భలే ఉన్నాడే'  సినిమా సెప్టెంబర్ 13న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేషకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫ్లాప్‌ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈటీవీ విన్ లో అక్టోబర్ 3న ప్రసారానికి అందుబాటులోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఆడోళ్లకి ఆమడ దూరం వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
'వెట్టయన్' తమిళనాడు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Sep 27, 2024, 07:46 PM
'స్వాగ్' నుండి స్వాగ్ వార్ వీడియో రిలీజ్ Fri, Sep 27, 2024, 07:40 PM
USAలో $3M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 27, 2024, 07:36 PM
50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Fri, Sep 27, 2024, 07:30 PM
'తాండల్' లో శివుని పాట Fri, Sep 27, 2024, 07:23 PM