'లగ్గం' విడుదల తేదీని ప్రకటించనున్న ప్రముఖ నటుడు

by సూర్య | Fri, Sep 27, 2024, 04:38 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న 'లగ్గం' పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని రేపు ఉదయం 10:10 గంటలకి టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

Latest News
 
ఇంస్టాగ్రామ్ లో 500K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Fri, Sep 27, 2024, 06:49 PM
'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ..కట్‌ల తర్వాత ఎమర్జెన్సీ మూవీని విడుదల చేయవచ్చు Fri, Sep 27, 2024, 05:24 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కాళీ' ట్రైలర్ Fri, Sep 27, 2024, 05:15 PM
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ Fri, Sep 27, 2024, 05:14 PM
సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన Fri, Sep 27, 2024, 05:13 PM