'మత్తు వదలరా 2' కలెక్షన్స్ ...

by సూర్య | Fri, Sep 27, 2024, 03:02 PM

గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో సీక్వెల్ మూవీలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైప్ క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాయి.అలాంటి సినిమాల్లో 'మత్తు వదలరా 2' ఒకటి. గతంలో వచ్చి క్రేజీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న 'మత్తు వదలరా' మూవీకి ఇది కొనసాగింపుగా రూపొందింది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి 'మత్తు వదలరా 2' సినిమా 14 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!


శ్రీ సింహా కోడూరి హీరోగా, సత్య మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా తీసిన ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలు చేశారు. దీనికి కాల భైరవ సంగీతం ఇచ్చాడు.'మత్తు వదలరా' మూవీతో ఆడియెన్స్‌ను ఫిదా చేసిన శ్రీ సింహా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' చేశాడు. దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 8.00 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.


కామెడీ కథతో థ్రిల్‌కు గురి చేసే కంటెంట్‌తో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగానే వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినప్పటికీ రెండో వీకెండ్‌లో ఇది పుంజుకుంది. కానీ, 14వ రోజు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా మళ్లీ పడిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం రూ. 14 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసుకుంది.

Latest News
 
ఇంస్టాగ్రామ్ లో 500K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Fri, Sep 27, 2024, 06:49 PM
'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ..కట్‌ల తర్వాత ఎమర్జెన్సీ మూవీని విడుదల చేయవచ్చు Fri, Sep 27, 2024, 05:24 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కాళీ' ట్రైలర్ Fri, Sep 27, 2024, 05:15 PM
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ Fri, Sep 27, 2024, 05:14 PM
సుప్రీంకోర్టులో ‘12th ఫెయిల్’ ప్రదర్శన Fri, Sep 27, 2024, 05:13 PM