USAలో $2.8M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్

by సూర్య | Fri, Sep 27, 2024, 02:51 PM

శివ కోరటాల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ నటించిన యాక్షన్ డ్రామా "దేవర: పార్ట్ 1" సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ఈ సిఎంమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ మరియు హంసిని ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసాయి. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ఉత్తర అమెరికాలో $2.8 మిలియన్‌ ప్రీమియర్ గ్రాస్ ని వాసులు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.

Latest News
 
'35-చిన్న కథ కాదు' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Sep 27, 2024, 06:53 PM
ఇంస్టాగ్రామ్ లో 500K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Fri, Sep 27, 2024, 06:49 PM
'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ..కట్‌ల తర్వాత ఎమర్జెన్సీ మూవీని విడుదల చేయవచ్చు Fri, Sep 27, 2024, 05:24 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కాళీ' ట్రైలర్ Fri, Sep 27, 2024, 05:15 PM
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ Fri, Sep 27, 2024, 05:14 PM