రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'సత్యం సుందరం'

by సూర్య | Fri, Sep 27, 2024, 02:46 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెయ్యళగన్' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు థియేటర్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
'పుష్ప 2' నుండి అజయ్ పోస్టర్ అవుట్ Fri, Sep 27, 2024, 04:47 PM
'లగ్గం' విడుదల తేదీని ప్రకటించనున్న ప్రముఖ నటుడు Fri, Sep 27, 2024, 04:38 PM
నేడు విడుదల కానున్న 'స్వాగ్' లోని నీలో నాలో సాంగ్ Fri, Sep 27, 2024, 04:31 PM
'భూల్ భూలయ్యా 3' టీజర్ అవుట్ Fri, Sep 27, 2024, 04:26 PM
'దేవర' ఆడియో జ్యుక్ బాక్స్ అవుట్ Fri, Sep 27, 2024, 04:22 PM