OTT ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'డీమోంటే కాలనీ 2'

by సూర్య | Fri, Sep 27, 2024, 02:26 PM

సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పంపిణీ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ఆగస్ట్ 23న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ ల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ OTT రైట్స్ ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం జీ5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27, 2024 నుండి జీ5లో తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ పిల్టఫార్మ్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'35-చిన్న కథ కాదు' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Fri, Sep 27, 2024, 06:53 PM
ఇంస్టాగ్రామ్ లో 500K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Fri, Sep 27, 2024, 06:49 PM
'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ..కట్‌ల తర్వాత ఎమర్జెన్సీ మూవీని విడుదల చేయవచ్చు Fri, Sep 27, 2024, 05:24 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కాళీ' ట్రైలర్ Fri, Sep 27, 2024, 05:15 PM
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ‘మిస్ట‌ర్ సెల‌బ్రిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ Fri, Sep 27, 2024, 05:14 PM