జస్ట్‌ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్‌రాజ్‌ మరో పోస్ట్‌ |

by సూర్య | Fri, Sep 27, 2024, 12:01 PM

తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపైనా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. ఆ తర్వాత నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. ‘‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్’’ అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.


ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  మాట్లాడుతూ.. ప్రకాశ్‌రాజ్‌ పోస్టులపై అసహనం వ్యక్తంచేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్‌ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశ్‌రాజ్‌ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్‌ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు. ఇదిలాఉండగా, గురువారం ప్రకాశ్‌రాజ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘గెలిచే ముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? #జస్ట్‌ ఆస్కింగ్‌!’’ అని ఆయన రాసుకొచ్చారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ పెట్టింది ఆయన చెప్పలేదు.

Latest News
 
USAలో $2.8M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 27, 2024, 02:51 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'సత్యం సుందరం' Fri, Sep 27, 2024, 02:46 PM
'లగ్గం' విడుదల తేదీ రివీల్ కి తేదీ ఖరారు Fri, Sep 27, 2024, 02:41 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ప్రతినిధి 2' Fri, Sep 27, 2024, 02:35 PM
'సరిపోదా శనివారం' నుండి లాలిజో రాగం వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 27, 2024, 02:30 PM