'దేవర' నుండి ఆయుధ పూజా సాంగ్ రిలీజ్

by సూర్య | Thu, Sep 26, 2024, 07:31 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఆయుధపూజ పాటను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM