సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'సత్యం సుందరం'

by సూర్య | Thu, Sep 26, 2024, 05:14 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెయ్యళగన్' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు థియేటర్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
'వెట్టయన్' తమిళనాడు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Sep 27, 2024, 07:46 PM
'స్వాగ్' నుండి స్వాగ్ వార్ వీడియో రిలీజ్ Fri, Sep 27, 2024, 07:40 PM
USAలో $3M మార్క్ ని చేరుకున్న 'దేవర' ప్రీమియర్ గ్రాస్ Fri, Sep 27, 2024, 07:36 PM
50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు' టీమ్ Fri, Sep 27, 2024, 07:30 PM
'తాండల్' లో శివుని పాట Fri, Sep 27, 2024, 07:23 PM