ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేసింది ...ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?

by సూర్య | Thu, Sep 26, 2024, 12:57 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా నిన్ను చూడాలని ఉంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆది, సింహాద్రిలతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటు హాలీవుడ్‌కు సైతం దడ పుట్టించాడు.త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దాదాపు 5 సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకున్ని మరి ఎన్టీఆర్ దేవర సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో సంచల రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ తో ఇప్పటివరకు ఎందరో హీరోయిన్లు నటించారు. వారిలో ఒక్క హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్‌కు ఎంతో స్పెషల్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎన్టీఆర్‌కు అంత స్పెషల్ ఏమిటి అనే విషయాలు ఇక్కడ చూద్దాం.


ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో ఇప్పటివరకు 4 సినిమాలకు పైగా వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్. వీళ్ళిద్దరూ నటిచ్చిన ఈ నాలుగు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. సమంతా నటించిన ప్రతి సినిమాలోనూ ఆమెతో పాటు మరో హీరోయిన్ నటించింది. కాజల్, శ్రుతిహాసన్, ప్రణీత, నిత్యామీనన్ నటించారు.


ప్రస్తుతం తారక్ దేవర తర్వాత వార్2, డ్రాగన్, దేవర2 చేస్తారు. ఈ సినిమాల్లో హీరోయిన్ గా ఎక్కడా సమంతకు అవకాశం లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం రావడం కష్టమేనని అంటున్నారు. అంతేకాకుండా మయోసైటిస్ కారణంగా చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నరకు పైగా గ్యాప్ ఇచ్చింది సమంత. ఇదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. ఈ సమయంలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చారు. ఇక దీంతో స్టార్‌ హీరోలు కూడా వారివైపే మొగ్గుచూపుతుండటంతో సమంతకు వరుస సినిమాలు రావడం కష్టంగా మారింది.



 


Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM