రేపే 'సరిపోదా శనివారం' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Wed, Sep 25, 2024, 03:45 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోద శనివారం' చిత్రం ఆగస్ట్ 29, 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ సినిమా రేపు అంటే సెప్టెంబర్ 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మెడిలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయికుమార్, అభిరామి, మురళి శర్మ, అజయ్, హర్షవర్ధన్, సుధాకర్, సుప్రీత్ రెడ్డి, అదితి బాలన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాకు జేక్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM