అక్టోబర్ 31న విడుదల కానున్న అమ‌ర‌న్

by సూర్య | Wed, Sep 18, 2024, 05:48 PM

శివకార్తికేయన్  హీరోగా నటించిన ‘అమరన్‌’  చిత్రం డబ్బింగ్‌ పూర్తయినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సాయి ప‌ల్ల‌వి  క‌థానాయిక చేసిన ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. సోనీ పిక్చర్‌తో కలిసి విశ్వనటుడు కమల్‌ హాసన్ రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించారు. ‘రంగూన్‌’ ఫేం రాజ్‌కుమార్‌ పెరియస్వామి  దర్శకుడు. మునుపెన్నడూ చూడని అవతార్‌, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో శివకార్తికేయన్ ఈ మూవీలో కనిపించబోతుండ‌డం విశేషం.కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ : ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ స్క్రిప్టును సిద్ధం చేశారు. శివకార్తికేయన్‌ సైనికుడి పాత్రలో నటించారు. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ రూ.55 కోట్లకు కొనుగోలు చేసుకున్నట్టు సమాచారం. సాయిపల్లవి హీరోయిన్‌. అక్టోబరు 31వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రం డబ్బింగ్‌ పూర్తయినట్టు చిత్రబృందం ప్రకటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబర్ 31న ఈ అమ‌ర‌న్  చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Latest News
 
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'జనక అయితే గనక' టీమ్ Thu, Oct 10, 2024, 03:19 PM
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'జిగ్రా' Thu, Oct 10, 2024, 03:14 PM
భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'కంగువ' Thu, Oct 10, 2024, 03:09 PM
'విశ్వం' లోని గుంగురు గుంగురు సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Oct 10, 2024, 02:59 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'వెట్టయన్' Thu, Oct 10, 2024, 02:54 PM