by సూర్య | Mon, Sep 16, 2024, 03:39 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ (21) రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిర్యాదు చేసిన మహిళను సైతం పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై జానీ మాస్టర్ ఇంకా స్పందించకపోవటం గమనార్హం.
Latest News