by సూర్య | Mon, Sep 16, 2024, 03:06 PM
ప్రియాంక అరుల్ మోహన్ 20 నవంబర్ 1994న జన్మించింది. ఆమె తండ్రి తమిళుడు మరియు తల్లి కన్నడిగ. ఆమె మూడబిద్రిలోని అల్వాస్ PU కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించింది.ఆమె బెంగళూరులో ఇంజినీరింగ్ చదివింది. ఆమె చెన్నైలో నివసిస్తున్నారు.2019లో గిరీష్ జి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఓంధ్ కథే హెల్లాలో ప్రియాంక తన అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఆమె తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా తెలుగుఅరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. 2022లో శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించింది.2021లో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన శివకార్తికేయన్ యొక్క డాక్టర్‌తో ఆమె తమిళంలో అడుగు పెట్టింది. ఆమె నటనకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌లో ₹100 కోట్లు వసూలు చేసింది మరియు విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నూతన నటిగా SIIMA అవార్డును గెలుచుకుంది.
తాజా ధనుష్‌కి జోడిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించింది. సంక్రాంతి కనుకగా ఈ చిత్రం తమిళంలో విడుదలైంది. ఈ నెల 26న తెలుగులో కూడా విడుదల కానుంది. మరియు జయం రవితో కలిసి M. రాజేష్ దర్శకత్వంలో బ్రదర్ అనే చిత్రంతో నటిస్తుంది.తాజాగా తెలుగులో నానికి జోడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే యాక్షన్ డ్రామా చిత్రం కథానాయకిగా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజిలో నటిస్తుంది ఈ వయ్యారి భామ. ఇది పాన్ ఇండియా చిత్రం.
Golden sparrow @priyankaamohan #priyankaamohan #PriyankaArulMohan pic.twitter.com/nxT5oZel6U
— cinema gallery (@Feeling68498580) September 16, 2024