'మత్తు వదలారా '2 రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్

by సూర్య | Mon, Sep 16, 2024, 02:43 PM

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ కామెడీ 'మత్తు వదలారా 2' గత శుక్రవారం విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్య, శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి ప్రముఖ తారల దృష్టిని ఆకర్షించింది. వారు సినిమాను ప్రశంసించారు. కేవలం విడుదలైన రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లు వాసులు చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. కాల భైరవ స్వరపరిచిన ఈ చిత్ర సౌండ్‌ట్రాక్ దాని ఆకర్షణను పెంచుతుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 16 కోట్లు. మత్తు వదలారా 2 ఇప్పటికే గణనీయమైన బజ్‌ని సృష్టించింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Latest News
 
'సైమా' డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 5, 6న ఈవెంట్స్ Fri, Jul 18, 2025, 07:39 PM
త్వరలో విడుదల కానున్న 'స్వయంభూ' టీజర్ Fri, Jul 18, 2025, 06:55 PM
AA22XA6 కోసం అట్లీ మరియు సాయి అభ్యంక్కర్ జామ్ సెషన్ Fri, Jul 18, 2025, 06:49 PM
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బింబిసార' సీక్వెల్ Fri, Jul 18, 2025, 06:41 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ కంపోజర్ Fri, Jul 18, 2025, 06:38 PM