by సూర్య | Mon, Sep 16, 2024, 02:32 PM
కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజా, ఆ తరువాత చాలా రోజులు ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డారు.కానీ ఇప్పుడు మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది.
రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మ కెరీర్‌ని కష్టాల్లో పడేశాయి.ఈ పరిస్థితుల్లో నార్త్‌లో దేవా అవకాశం రావటంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్ నుంచి కూడా పూజ హెగ్డేకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న లో పూజానే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ కోసం భారీ పేమెంట్ డిమాండ్ చేసినా.. ఓకే చెప్పింది చిత్రయూనిట్.ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. విజయ్ హీరోగా రూపొందుతున్న ఆఖరి చిత్రం దళపతి 69లోనూ పూజను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. ఆల్రెడీ ఈ కాంబినేషన్‌లో వచ్చిన బీస్ట్ మంచి విజయం సాధించింది.అందుకే మరోసారి ఈ కాంబోనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది దళపతి 69. ఇలాంటి ప్రస్టీజియస్ మూవీలో ఛాన్స్ రావటంతో పూజా హెగ్డే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.
Latest News