'తిరగబడరా సామి' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...!

by సూర్య | Mon, Sep 16, 2024, 02:25 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామి' ఇటీవలే విడుదల ఆయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమయ్యి బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. పిల్లా నువ్వు లేని జీవితం ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రను పోషిస్తుండగా, మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో రఘుబాబు, బిత్తిరి సత్తి మరియు రాచ రవి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి బస్వ పైడి రెడ్డి ఎడిటింగ్ మరియు భాష్యశ్రీ పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు. జెబి మరియు భోలే షావలి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది.

Latest News
 
సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ Fri, Jul 11, 2025, 08:48 PM
పవన్ కల్యాణ్ మాజీ భార్యకు సర్జరీ Fri, Jul 11, 2025, 08:41 PM
ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ Fri, Jul 11, 2025, 08:39 PM
'OG' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jul 11, 2025, 07:00 PM
10వ వార్షికోత్సవం సందర్భంగా కలిసిన 'బాహుబలి' బృందం Fri, Jul 11, 2025, 06:57 PM