బాక్సాఫీస్‌ను రికార్డు వసూళ్లతో కుమ్మేసిన విజయ్ గోట్ మూవీ.....

by సూర్య | Mon, Sep 16, 2024, 12:57 PM

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ చిత్రం కలెక్షన్ల ప్రవాహాన్ని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్నది. టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో భారీ వసూళ్లు రాబట్టింది. గత 11 రోజుల్లో ఈ సినిమా ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలే అనే వివరాల్లోకి వెళితే విజయ్‌తోపాటు స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. ఈ మూవీని నిర్మాతలు కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ వరల్డ్ వైడ్‌గా 6000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా భారీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. మిక్స్ డ్ టాక్‌తో ది గోట్ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం తొలివారం తమిళంలో 157 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్లు, కన్నడలో 25 కోట్లు, కేరళో 12 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 17 కోట్లు వసూలు చేసింది. తొలివారం ఈ సినిమా ఇండియాలో 224 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో ది గోట్ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించింది. తమిళంలో ఈ చిత్రం 9వ రోజు 7 కోట్ల రూపాయలు, 10వ రోజు 13 కోట్ల రూపాయలు, 11వ రోజు 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో వారంలో 25 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది. దాంతో ఈ సినిమా 250 కోట్లకుపైగా రూపాయలు ఇండియాలోనే వసూలు చేసింది. 11వ రోజున ది గోట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. తమిళం, ఇతర భాషల్లో 15 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. రెండో వారాంతంలో ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.


ఓవర్సీస్‌లో విజయ్ నటించిన ది గోట్ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనాన్ని కొనసాగించింది. నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఈ చిత్రం 4.5 మిలియన్ డాలర్లు అంటే 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం 1.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు రాబట్టింది. మిగితా దేశాల్లో కలిపి ఈ చిత్రం సుమారుగా 18 మిలియన్ డాలర్లు అంటే.. 151 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ది గోట్ చిత్రం థియేట్రికల్ రైట్స్‌కు భారీ ధరకు అమ్ముడుపోయాయి. కానీ ఆంధ్రా, నైజాం, కేరళలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోవడంతో భారీ నష్టాలను మిగిల్చింది. తమిళం, ఓవర్సీస్, కన్నడలో ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేయడంతో ఈ చిత్రం 400 కోట్ల మైలురాయిని దాటింది.

Latest News
 
'ఆడుజీవితం' గ్రామీ నామినేషన్‌ను కోల్పోవటానికి కారణం వెల్లడించిన AR రెహమాన్ Thu, Oct 10, 2024, 05:23 PM
'బౌగెన్‌విల్లా' ట్రైలర్ అవుట్ Thu, Oct 10, 2024, 05:18 PM
'దేవర 2' షూటింగ్ ఈ సమయంలో ప్రారంభం కానుందా? Thu, Oct 10, 2024, 05:12 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మా నాన్న సూపర్ హీరో' Thu, Oct 10, 2024, 05:05 PM
త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనున్న పా రంజిత్ యొక్క 'వెట్టువం' Thu, Oct 10, 2024, 04:59 PM