by సూర్య | Mon, Sep 16, 2024, 12:42 PM
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి హీరో నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్. ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిపోదా శనివారం కు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా నాని నుంచి మరో మూవీ సరిపోద్దా శనివారం కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆదరించడానికి నాని సిద్ధమయ్యాడు. సరిపోదా శనివారం నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజ్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Latest News