by సూర్య | Mon, Sep 16, 2024, 12:30 PM
బాక్సాఫీస్ బరిలో 'మత్తు వదలరా 2' సినిమా జోరు హుషారు కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్, విశాఖ వంటి నగరాలలో ఆదివారం వినాయక నిమజ్జనం సందడి నెలకొంది.ప్రజలు చాలా మంది పెద్ద ఎత్తున నిమజ్జనాలలో పాల్గొన్నారు. అయినా సరే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చారు. సినిమా చూశారు. దాంతో ఓపెనింగ్ వీకెండ్ 'మత్తు వదలరా 2'కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. శ్రీ సింహ కోడూరు, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాకు రెండు రోజుల్లో 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మూడో రోజు ఐదు కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని, మొత్తం మూడు రోజుల్లో 16 కోట్ల 20 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయని పేర్కొన్నారు.
Latest News