శేఖర్ బాషా ఆసక్తికర కామెంట్స్..

by సూర్య | Mon, Sep 16, 2024, 12:25 PM

బిగ్‏బాస్‏ సీజన్ 8లో రెండో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. అయితే ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క బయటకు రాగా.. రెండో వారం ఎవరూ ఊహించని కంటెస్టెంట్ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు.నిజానికి రెండో వారం డేంజర్ జోన్‏లో పృథ్వీ, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం ఉన్నారు. వీరి ముగ్గురి కంటే శేఖర్ బాషాకు ఎక్కువగానే ఓటింగ్ వచ్చింది. అంటే శేఖర్ బాషా ఈ వారం సేఫ్ లో ఉన్నాడు. కానీ ఇటీవలే అతడికి కొడుకు పుట్టినట్లు ఈ ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున చెప్పేశారు. దీంతో బిడ్డ పుట్టిన ఆనందంలో.. తన కొడుకును చూసుకోవాలనే ఆత్రుతతో హౌస్ నుంచి తనకు తానుగా శేఖర్ బాషా బయటకు వచ్చాడనే చెప్పాలి. ఈ విషయాన్ని బిగ్‏బాస్‏ స్టేజ్ పై అటు నాగార్జున కానీ.. ఇటు శేఖర్ బాషా చెప్పలేదు. కానీ సేఫ్ లో ఉన్న శేఖర్ బాషా కావాలనే హౌస్ నుంచి బయటకు వచ్చాడనేది మాత్రం అడియన్స్ కు తెలిసిన విషయమే.


మూడు రోజుల క్రితమే శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున చెప్పడంతో సంతోషంతో ఎమోషనల్ అయ్యాడు. తన భార్య, కొడుకును చూడాలనే ఆశతో ఎలాగైన బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడని.. అందుకు బిగ్‏బాస్‏ కూడా ఒప్పుకోవడంతో సేఫ్ జోన్ లో ఉన్న శేఖర్ బాషాను ఊహించని విధంగా ఎలిమినేట్ చేసేశారు. కానీ రెండో వారం ఎలిమినేషన్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. వారం మొత్తం అడియన్స్ వేసిన ఓటింగ్ పనికిరాదా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు హౌస్ లో అసలైన ఎంటర్ట్మెంట్ ఇస్తున్న శేఖర్ బాషాను బయటకు పంపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శేఖర్ బాషా.ఎలిమినేట్ అయిన తర్వాత ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ బాషా మాట్లాడుతూ.. “నేనే కావాలని బయటకు వచ్చేసాను. బిగ్‏బాస్‏ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకును చూసేందుకు నేను అడిగి బిగ్‏బాస్‏ హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. అలాగే నాకు కొంచెం ఫుడ్ కూడా ప్రాబ్లమ్ అయ్యింది. హౌస్ లో అందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను ఇంకా ముందుకు వెళ్తాను అని నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను” అని అన్నారు.

Latest News
 
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM