పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు

by సూర్య | Mon, Sep 16, 2024, 12:14 PM

టాలీవుడ్ హీరోహీరోయిన్ సిద్ధార్థ్, అదితి రావు హైదరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి ఏడడుగులు వేశారు.తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 'నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే' అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అదితి. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.


సిద్ధార్థ్, అదితి చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వీరిద్దరు తమ పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు తన నాన్నమ్మ అంటే చాలా ఇష్టమని.. ఆమె ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది.తనకు మోకాళ్లపై కూర్చొని పెళ్లి ప్రపోజ్ చేశాడని.. తన నాన్నమ్మ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని తెలిపింది. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని.. అందుకే నిశ్చితార్థం అక్కడ చేసుకున్నామని తెలిపింది. ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని తెలిపింది. ఇక ముందే చెప్పినట్లు రంగనాథస్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అదితి వివాహం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది.

Latest News
 
సత్యదేవ్ కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ Tue, Apr 22, 2025, 07:01 PM
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM