by సూర్య | Sun, Sep 15, 2024, 08:23 PM
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2024 వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రంలోని బాలయ్య నటనకు విశేష స్పందన లభించింది. వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య అలరించారు. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, 2023లో భగవంత్ కేసరి దసరాకు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
Latest News