by సూర్య | Sun, Sep 15, 2024, 11:31 AM
‘మత్తు వదలరా’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. సినిమా చాలా బాగుంది’ అని పేర్కొన్నారు.
Latest News