రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదు : మాళవిక మోహనన్

by సూర్య | Sat, Sep 14, 2024, 07:04 PM

ఇటీవలే తంగలాన్ తో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం చేతినిండా లతో చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు హిందీ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.యుధ్రా మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది మాళవిక. అయితే ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.ఇటీవలే తంగలాన్ తో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం చేతినిండా లతో చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు హిందీ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.యుధ్రా మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది మాళవిక. అయితే ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. తాజాగా అలాంటి సీన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదన్నారు.రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఏ సెట్ లోనైనా అందుకు సంబంధించిన కో ఆర్టినేటర్ ను నియమిస్తున్నారు. నటీనటులు ఆ సీన్స్ చేసేముందు ఇబ్బందిపడకుండా ఎలా యాక్ట్ చేయాలో వారు చెబుతుంటారు. అది చాలా మంచి నిర్ణయం.కానీ సాథియా సాంగ్ గురించి చెప్పినప్పుడు నేను, సిద్ధాంత్ చాలా కంగారుపడ్డాం. మేము చేయగలమా అని సందేహపడ్డాం. సముద్ర తీరం, చలి ఎక్కువగా ఉంది. దీంతో తొందరగా షూట్ కంప్లీట్ చేయాలని డైరెక్టర్ చెప్పినట్లు చేసేశాం.ల్లో రొమాంటిక్ సీన్స్ చేయడం అంత సులభం కాదు. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి. సౌకర్యవంతమైన వాతావరణం కూడా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది మాళవిక. ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది.

Latest News
 
బిగ్ బాస్ నుంచి కిర్రాక్ సీత అవుట్ Mon, Oct 14, 2024, 08:16 AM
టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌‌పై తాప్సీ ఆగ్రహం Sun, Oct 13, 2024, 09:17 PM
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM